జలజలా కురుస్తోంది కన్నిటి వాన
కన్నీరే మున్నీరవుతోంది
వ్యధాభరిత జీవితపాశులు
ఆనందానుభూతులే జీవితమైనవాళ్ళు
ఎవరైనా ఒకటే
పశుపక్ష్యాదులకూ అది నేస్తం
కన్నీరే మున్నీరవుతోంది
వ్యధాభరిత జీవితపాశులు
ఆనందానుభూతులే జీవితమైనవాళ్ళు
ఎవరైనా ఒకటే
పశుపక్ష్యాదులకూ అది నేస్తం
మానవ జాతికే విచిత్ర చుట్టం
కన్నీటి చుక్క
అదిమిన కొద్దీ ఉబుకుతోంది
పిపీలకాల్లాంటి మనుషుల్లో దాగివున్న మహార్ణవమది
ఒకప్పుడు దానికీ విలువుంది
చుక్కరాలితే ఒకటే ఖంగారు , భయం
ఆ వెంటే ఓదార్పులు, నిట్టూర్పులూ
ఆ క్షణాన దానికి అందరూ ఆప్త మితృలే
గతం గతః
ఇపుడంతా స్మశాన నిశ్శబ్దమే
కన్నీటి చుక్క జారుతుంటే
బుగ్గలు తడిసి పెదాలకు ఉప్పగా తగిలినా
ఎవరికీ పట్టదు
బొట్టు బొట్టూ రాలుస్తూ
కాల్వలూ నదీనదాలు కడ్తున్నా
చూసేవారు లేరు
మానవజాతి పుట్టిన నాటి నుండీ
పొంగుతున్న ఆ చుక్క
ఈ వస్తువాద ప్రపంచంలో
పాపం యిపుడు ఒంటరిది
దానికి ఓదార్పే కరవు
-- గుండిమెడ రామచంద్ర శర్మ
4/2/2008
No comments:
Post a Comment