శిశిరం
-- రామచంద్ర శర్మ గుండిమెడ (21/1/2014)
ఆకులు రాలుతున్నాయి ఆవిరవుతున్న ఆశలలాగే
మోడువారే తీవెలు తడారిన తిన్నెలు నీరింకిన కళ్ళలాగే
కాంక్షల తీరంలో ఈవల నేను... అల్లరి అలలా అక్కడే నీవు
ఇద్దరికీ మధ్య అడ్డుగా చెలియలికట్ట వెక్కిరిస్తోంది కదూ
రాలిన ఆకులు తీవెలను ముద్దాడకపోవా?... ఆవిరైన ఆశలు చివురు తొడగకపోవా?
శిశిరంలో వసంతం రాదా...
No comments:
Post a Comment