Pages

Saturday, March 15, 2014

అతిరథ మహారథుడు అనూరుండైన వైనం

ఆయనో చిన్న రాజు... అంచెలంచెలుగా రాజ్యాన్ని విస్తరించాడు... చుట్టూ బంధుమిత్ర సపరివారం వంధిమాగధులూ వెంట స్తోత్రపాఠాలతో కీర్తిస్తుండగా కీర్తనా మహిమతో తనను తాను అతిరథుడిగా భావించి పొంగిపొర్లుతున్న ఆనందం ఆపలేక కదనానికి కాలు దువ్వాడు... ఆయన అంగరంగ రాజ్యానికి బాసటగా వేలాది యోధులు తమ సర్వస్వం సమర్పించి ముందుకు ఉరికారు. ముందుగా శత్రు సైన్యం ఈయన మందీ మార్బలాన్ని చూసి ఈయన అతిరథ మహారథుడని నిదానించారు... భీకర యుద్ధంలో ఈ రథ శ్రేష్టుడైన రాజుగారికి ఊహించని పరాజయం ఎదురైంది . వెనుతిరిగి చూస్తే సకుటుంబం 18 మంది పరివారం మిగిలారు. ధనాగారం దెబ్బ తినకపోవడంతో ముందు ముందు రాజ్య విస్తరణ చేయాలని భావించినవాడై మిన్నకుండిపోయాడు. తాను ఈ స్థితికి రావడానికి కారణమైన మహారాణిని ముందు తిట్టుకునినూ తదుపరి రాణిగారి సామంతుడు పడుతున్న ఇబ్బంది చూసి మనసు నీరై తన అంగరంగ రాజ్యాన్ని మహా సామ్రాజ్యంలో కలిపేసి ఆనంద బాష్పాలు రాల్చాడు. అప్పటినుంచే కష్టం మొదలయ్యింది . రాజ్యం అప్పగించడంపై అలకలు మొదలయ్యాయి . ఈలోగా ఆయన పుట్టిన రాజ్యం రెండు చేయాలని రాణిగారు సంకల్పించారు. అంతకుముందు వరకూ అతిరథ మహారథుడైన రాజుగారు రాత్రికి రాత్రి అర్థరధుడయ్యాడు. ఆ స్థితిలో ఆయన్ని చూడలేని మహారాణి అంగరాజువి కాకున్నా నీవునూ మా సామంతరాజువే అని పట్టాభిషేకం జరిపించారు.తదనంతరం పుట్టిన రాజ్య విభజన మొదలైంది . నేను పుట్టానక్కడ విడదీయొద్దని చేసిన మొర విఫలం అయింది .  అంగరాజు సామంతుడిగా ఊడిగం చేస్తూనే తన తప్పేం లేదని కన్నీరు పెట్టాడు ఎటూ కదలలేని స్థితికి చేరాడు. ఈలోగా యుద్ధ భేరి మోగింది . నీది ఎటూ కదలలేని స్థితి కావున సారధ్యం నీదేనని మహా రాణి భరోసా ఇచ్చింది. ఆనందంతో ముందడుగు వేసిన ఆయనకు రథ పగ్గాలు అప్పగించారు. నీ బాధ్యత రధం తోలుటయే అని రాణి వారు చెప్పారు .
అతిరథ మహారథుడైనఅంగరంగ రాజు చివరికి  సర్వం పోయి కదలలేని స్థితిలో అనూరుడై రథం తోలుటలో శిక్షణ పొందుచున్నాడు
ఆయనో చిన్న రాజు... అంచెలంచెలుగా రాజ్యాన్ని విస్తరించాడు... చుట్టూ బంధుమిత్ర సపరివారం వంధిమాగధులూ వెంట స్తోత్రపాఠాలతో కీర్తిస్తుండగా కీర్తనా మహిమతో తనను తాను అతిరథుడిగా భావించి పొంగిపొర్లుతున్న ఆనందం ఆపలేక కదనానికి కాలు దువ్వాడు... ఆయన అంగరంగ రాజ్యానికి బాసటగా వేలాది యోధులు తమ సర్వస్వం సమర్పించి ముందుకు ఉరికారు. ముందుగా శత్రు సైన్యం ఈయన మందీ మార్బలాన్ని చూసి ఈయన అతిరథ మహారథుడని నిదానించారు... భీకర యుద్ధంలో ఈ రథ శ్రేష్టుడైన రాజుగారికి ఊహించని పరాజయం ఎదురైంది . వెనుతిరిగి చూస్తే సకుటుంబం 18 మంది పరివారం మిగిలారు. ధనాగారం దెబ్బ తినకపోవడంతో ముందు ముందు రాజ్య విస్తరణ చేయాలని భావించినవాడై మిన్నకుండిపోయాడు. తాను ఈ స్థితికి రావడానికి కారణమైన మహారాణిని ముందు తిట్టుకునినూ తదుపరి రాణిగారి సామంతుడు పడుతున్న ఇబ్బంది చూసి మనసు నీరై తన అంగరంగ రాజ్యాన్ని మహా సామ్రాజ్యంలో కలిపేసి ఆనంద బాష్పాలు రాల్చాడు. అప్పటినుంచే కష్టం మొదలయ్యింది . రాజ్యం అప్పగించడంపై అలకలు మొదలయ్యాయి . ఈలోగా ఆయన పుట్టిన రాజ్యం రెండు చేయాలని రాణిగారు సంకల్పించారు. అంతకుముందు వరకూ అతిరథ మహారథుడైన రాజుగారు రాత్రికి రాత్రి అర్థరధుడయ్యాడు. ఆ స్థితిలో ఆయన్ని చూడలేని మహారాణి అంగరాజువి కాకున్నా నీవునూ మా సామంతరాజువే అని పట్టాభిషేకం జరిపించారు.తదనంతరం పుట్టిన రాజ్య విభజన మొదలైంది . నేను పుట్టానక్కడ విడదీయొద్దని చేసిన మొర విఫలం అయింది .  అంగరాజు సామంతుడిగా ఊడిగం చేస్తూనే తన తప్పేం లేదని కన్నీరు పెట్టాడు ఎటూ కదలలేని స్థితికి చేరాడు. ఈలోగా యుద్ధ భేరి మోగింది . నీది ఎటూ కదలలేని స్థితి కావున సారధ్యం నీదేనని మహా రాణి భరోసా ఇచ్చింది. ఆనందంతో ముందడుగు వేసిన ఆయనకు రథ పగ్గాలు అప్పగించారు. నీ బాధ్యత రధం తోలుటయే అని రాణి వారు చెప్పారు . అతిరథ మహారథుడైనఅంగరంగ రాజు చివరికి  సర్వం పోయి కదలలేని స్థితిలో అనూరుడై రథం తోలుటలో శిక్షణ పొందుచున్నాడు.

No comments: