UNCLE PODGER HANGS A PICTURE
ఇది చిన్నప్పుడు ఇంగ్లీషు నాన్ డిటెయిల్ లో చదువుకున్న కథ పేరు। కథ చదువుకున్న రోజుల్లో గుర్తున్నంతగా ఇప్పుడు చెప్పలేను గానీ। స్థూలంగా మాత్రం చెప్పగలను। అంకుల్ పోడ్జర్ కథలో హీరో। కథంతా ఆయన చుట్టూ తిరుగుతుంది। ఆయనతో పాటు పిల్లలు ఉన్నా కథలో ఆయనే ప్రధానం। కథేమిటంటే పెద్ద ఇల్లు। దాంట్లో అంకుల్ పోడ్జర్ ఆయన పిల్లలు నివసిస్తుంటారు। ఒక రోజు ఆ ఇంట్లో హాల్లో గోడకు ఒక చిత్రపటం అందంగా అలంకరించాలని అంకుల్ అనుకుంటాడు। పిల్లలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు। తన ఫొటో తనే ఎలాగైనా గోడకి తగిలించాలని నిర్ణయించేస్తాడు। ఓ రోజు అంతా వెళ్ళాక మేకులూ సుత్తి సరంజామాతో ఫొటో గోడకు వేలాడతీసే కార్యక్రమం మొదలు పెడతాడు। ఫొటో బిగించడం మొదలు పెట్టగానే చేతి మీద సుత్తితో కొట్టుకుంటాడు। పాతగోడ కావడం తో మేకులు ఊడిపోతుంటాయి పటం జారి కిందపడుతుంది ।అన్నీ అడ్డంకులే । అయినా మొక్కవోని దీక్ష తో అంకుల్ పోడ్జర్ కృషి చేసి పటాన్ని గోడకు తగిలిస్తాడు। ఈలోగా పిల్లలు ఇంటికి చేరుకుంటారు ।వారిని చూసి విజయగర్వంతో నవ్వుతాడు। పిల్లలు గోడవైపు చూసి నవ్వుతారు। ఫ్రేమ్ విరిగిన ఒక ప్రక్కకు ఒరిగిపోయిన పటం గోడకు వేలాడుతుంది।
ఇది ఎందుకు గుర్తు వచ్చిందంటే సమైక్యాంధ్ర చిత్రపటాన్ని మోస్తున్న అశోక్ బాబును చూసి। అంకుల్ పోడ్జర్ ధ్యేయం గోడకు పటాన్ని ఎలాగో ఒకలాగ తగిలించడం ।అందుకు పటానికి ఆధారంగా గోడ ఎంచుకున్నాడు పగిలినా ఫ్రేం పటాన్ని అడ్డదిడ్డంగానైనా వేలాడదీసి గెలిచానని సంతృప్తి పడ్డాడు ।కానీ అశోక్ బాబు మాత్రం గోడ లేకుండా సమైక్య పటం పట్టుకునిదాన్ని వేలాడదీసేందుకు ఊరూరా తిరుగుతూ గాలిలో మేకులు కొట్టేస్తున్నాడు ।ఎన్నిసార్లు వేలు చితగ్గొట్టుకుంటారు। ఎన్ని రోజులకు పటం వేలాడదీస్తారూ ।??
Monday, November 11, 2013
సరదాగా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment