చీకట్లు కమ్ముకున్నాయ్...
ఎటుచూసినా స్మశాన నిశ్శబ్దమే...
ఏమిటో తెలీని భయాలు...
ఈ చీకటి చెదిరిపోతుందనేమో...
ఈ నిశ్శబ్దం ఎంత హాయిగా ఉందీ
ఈ చీకట్లు ఇలానే ఉండనీ
చెదిరిపోనీయకు...
ఒడిసి పట్టుకో...
నిద్ర ఆపైనా ఇలానే..
జారిపోతే మళ్ళీ దొరకదు..
మెల్లగా దానికీ జోల పాడు...
చీకటితో సహచర్యం చేసే నిశ్శబ్దం అలానే ఉంటుంది
ష్.. చప్పుడు చేయకు
పారిపోతుంది
ఈ కాసేపైనా. నిశ్శబ్దంగా ఉండనీ
మళ్ళీ మామూలేగా తిట్లూ దీవెనలూ
నిట్టూర్పులూ... బతుకు సమరాలూ...
-రామ చంద్ర శర్మ గుండిమెడ
(15 ఆగస్ట్ 2013)
No comments:
Post a Comment