Pages

Sunday, May 24, 2015

బతుకు వెంపర్లాట


బతుకు వెంపర్లాట
బతుకుతున్నాం కాబట్టి వెంపర్లాడుతున్నాం బతుకు రహదారి ముళ్ళగానో సాఫీగానో కనపడుతోంది కాబట్టి నడిచేస్తున్నాం సుఖంగానో భారంగానో
కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అన్నది తెలిసి పుట్టినప్పుడూ పోయేటప్పుడూ ధారాపాతంగా నిన్ను నువ్వు తడిపేసుకోవడమో ఎదుటివారిని తడిపేయడమో చేసేస్తాం
ఆనందమో విషాదమో తెలిసే సరికి కట్టె మాట్లాడటమో నలుగురి భుజాలమీదుగా నిశ్చలంగా వెళ్ళడమో జరిగిపోతుంది....
ఈ మధ్య సమయంలో అహాలతో ఎగిరి పడుతూ పదిమందికీ దూరమవుతూ జీవిత చక్రాన్ని మనది చేసుకునేట్టు చూస్తాం...  మనకి కానిదాన్ని పొందేందుకు కనబడని దేవుడికి పొర్లు దండాలెడతాం... అవసరమైతే లంచం ఇవ్వజూపుతాం.. ఎన్ని చేసినా వెంట వచ్చేది ఏముండదు... కనీసం నీ చితాభస్మం కూడా....
24.5.2015