Pages

Tuesday, November 18, 2014

పచ్చగా...


ఇదేమిటి ఇలా సయ్యాటలాడుతోంది... చిరుగాలి సవ్వడికి  పరవశిస్తోంది... దీనికేమైందో...
వాళ్ళెవరో.. ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు... సయ్యాటలూ సవ్వడుల మధ్య వీళ్ళూ గొంతెత్తి పాడుతున్నారెందుకో... హలాల చేతులతో పొలాలు  తడుముతూ పొంగిపోతారేమిటో?...
వీళ్ళకి ఏదో అయింది ... మట్టి పిసికి పిసికీ మెదళ్ళు వీళ్ళకి మొద్దుబారుతున్నాయి...
వీళ్ళ బతుకు మట్టవుతోంది...
ఒరేయ్ ఆ మట్టి వదిలెయ్ నీ బతుకుతో పాటూ ఒళ్ళూ చల్లబరుస్తా....
చచ్చాక దొరికే స్వర్గం కన్నా బెస్టయిన స్వర్గంలో నీకు చల్లటి సౌఖ్యాలు ఇప్పిస్తా...
అటుచూడు.. నవీన స్వర్గ నిర్మాతలొస్తున్నారు... నీ బతుకు బీమా బీరువాలో భద్రపరిచి నవీన సుఖాలు పొందాక అందిస్తా... నా మాట వినవూ ... పచ్చగా సుఖిస్తావు?

-- రామచంద్ర శర్మ గుండిమెడ
18/11/2014